టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ ఈ పేరు వింటే ఎన్నో మనసుల్లో ఏదో ఒక తెలియని బాధ.. ప్రతి ఒక్కరి ఇంట్లో మనుషిల పక్కింట్లో మనతో చనువుగా ఉండే మనిషి లేకపోతే ఎలా ఫీలవుతాము ఉదయ్ కిరణ్ గురించి వింటే కూడా అలానే ప్రతి ఒక్కరికిి అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి 10 సంవత్సరాల పైన అవుతున్న కానీ ఆయన గురించి ఏదో ఒక వార్తల, ఆయన సినిమాల గురించి తరచూ వింటూనే ఉన్నాం. ఉదయ్ కిరణ్ సినిమాల విషయానికొస్తే ఆయన సినీ జీవితంలో తొలి సినిమా చిత్రం తో తిరుగులేని రికార్డులు అందుకున్నాడు. తేజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ కు తిరిగిలేని స్టార్డం క్రేజ్ వచ్చింది. అసలు ముఖ పరిచయమే లేని హీరో అందులోనూ కాలేజీ డేస్ లో ప్రేమించుకుని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వటం పిల్లల్ని కనటం అనేది ఆ సమయానికి అవుట్ ఆఫ్ బాక్స్ కండక్ట్.. అలాంటి కథతో  వచ్చి సూపర్ హిట్ కొట్టమంటే మామూలు విషయం కాదు.


అలాంటి బోల్డ్ గా అనిపించే కథను దర్శకుడు తేజ ప్రేక్షకులకు కనెట్ట్‌ అయ్యేలా చూపించడం ఉదయ్ కిరణ్, రీమాసేన్‌ల నటన ఇలా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హీట్ చేశాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమాను చేస్తే ఆ రోజుల్లో ఇలాంటి కంటెంట్ ఎలా తీశాడు రా బాబు అని అనకుండా ఉండలేం. అలా తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ సంచల రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ  సినిమా బడ్జెట్ కేవలం రూ. 30 లక్షలు.. అయితే ప్రమోషన్లు పబ్లిసిటీ ఖర్చులతో మరో 10 లక్షలు వరకు అయింది. అలా 42 లక్షల బిజినెస్ తో ఈ సినిమా ధియేటర్లో రిలీజ్ అయింది. అప్పట్లోనే తొలి సినిమాకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని హీరోకు ఈ రేంజ్ బడ్జెట్ అంటే చాలా ఎక్కువ.. ఇక నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన తొలి వారం వరకు అసలు థియేటర్లో జనాలే లేరు. మరోపక్క మేకర్స్ పబ్లిసిటీ ఖర్చులైన వెనక్కి వస్తాయా అని భయపడ్డారు.. కానీ మౌత్ టాక్ బీభత్సంగా పాజిటివ్ రావటంతో సెకండ్ వీక్ నుంచి జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు.


అలా కట్ చేస్తే నెలరోజుల పాటు  చాలాచోట్ల థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు వెలిశాయి. డిస్ట్రిబ్యూటర్లు మూడో వారానికి ఫుల్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయారు. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ లో అక్షరాల 12 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలానే టాలీవుడ్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే రామోజీరావుకు కనుక వర్షం కురిపించింది.. అప్పట్లో ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ కు రూ.11000 రెమ్యూనిరేషన్ తీసుకున్నాడట.  ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలోని ఉదయ్ కిరణ్ నువ్వు నేను అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా కూడా ఊహించిన విధంగా సూపర్ హిట్ అయింది. అలాగే  ఉదయ్ కిరణ్ కి తొలి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ వచ్చేసింది. అదే ఏడాది వీ.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా కూడా చేశాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర క్రిమెట్ చేసిన‌ రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇలా తొలి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కావడంతో.. ఇక ఉదయ్ కిరణ్, మరో మెగాస్టార్ అవుతాడాని అందరు భావించారు. కానీ అనూహ్యంగా.. ఆ తర్వాత ఉదయ్ సినీ గ్రాఫ్ మెల్లి మెల్లిగా కిందకు దిగుతూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: