* చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌
* వేణు కెరీర్‌ లో బ్లాక్‌ బాస్టర్‌
* బలగం సినిమాకు 100కు పైగా అవార్డులు
* తెలంగాణ యాష, భాషలో బలగం


గత సంవత్సరం ఒక చిన్న సినిమాగా విడుదలైన బలగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా చిన్నదా పెద్దదా అనేది లెక్క కాదు, బడ్జెట్ ఎంత పెట్టాము అనేది ముఖ్యం కాదు. సినిమా సక్సెస్ అయిందా లేదా వసూళ్లను రాబట్టిందా లేదా అనేది ముఖ్యం. ఈ సినిమా మంచి విజయం సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా టీవీలో కూడా మంచి టిఆర్పి రేటింగ్ ను రావట్టడం విశేషం. ఓవైపు ఈ సినిమా నవ్వులు పోయిస్తూనే, మరోవైపు సెంటిమెంటుతో కంటతడి పెట్టించారు. ఈ సినిమాకు బీమ్స్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద బలగం సినిమా తన బలం గట్టిగానే చూపించింది.


భారీ వసూళ్లను రాబట్టడంతో కలెక్షన్ల వరద పారింది. అంతేకాకుండా ఈ సినిమా దాదాపు 100కు పైగా అవార్డులను సాధించి బుల్లితెరపై తన హవాను చూపించింది. టెలివిజన్ రంగంలోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం టాప్ టీఆర్పి రేటింగ్ ను నమోదు చేసుకున్న సినిమాగా బలగం సినిమా నిలిచింది.


14.21 టిఆర్పి రేటింగ్ ను ప్రీమియర్ టెలికాస్ట్ లో సొంతం చేసుకుంది. బలగం సినిమా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా నిలిచింది. అచ్చమైన తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టిన ఈ సినిమా సెన్సేషనల్ అయ్యింది. ఈ సినిమా అనంతరం ఇందులో నటించిన నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: