- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ గత మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ సాగుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రు. 300 కోట్ల భారీ బడ్జెట్లో తెర‌కెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు వచ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి పోస్టర్లతో పాటు రెండు పోస్ట‌ర్లు మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు.


ఇప్పుడు టీజర్ కోసం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. దసరా కానుకగా టీజర్ వస్తుందనుకున్న రాలేదు.. ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. టీజర్ కట్ చేయడం పూర్తయిందని టీజర్ లో మరో కొత్త సాంగ్ యాడ్ చేశారని .. టీజర్ లో పవర్ఫుల్ డైలాగ్ లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే టీజర్ లో చరణ్ రెండో గెటప్ కూడా రివీల్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజర్ రిలీజ్ డేట్ పై వీకెండ్ లోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు అయితే పోస్టులు పెడుతున్నారు. అయితే ఎందుకో గాని గేమ్ ఛేంజర్ విషయంలో మేకర్స్ ఎంత చేసిన అనుకున్నంత హై రావడం లేదు.


మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు అయితే .. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ నుంచి ఏ మాత్రం ప్రేక్షకుల్లో అనుకున్నంత హైప్ అయితే లేదు. దీనికి తోడు శంకర్ గతంలో ఉన్నంత ఫాం లో లేడు. శంకర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒకప్పుడు ఉన్న ఆసక్తి లేదు భారతీయుడు 2 పెద్ద డిజాస్టర్ అయింది. ఈ ప్రభావం గేమ్ ఛేంజ‌ర్ పై గట్టిగా పడింది. చివరకు భారతీయుడు 3 సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేక ఓటీటీలో రిలీజ్ చేసుకోవలసిన పరిస్థితి. ఇది కూడా బిజినెస్ పై గట్టిగా ప్రభావం చూపుతోందని వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప రిలీజ్ కి ముందు అనుకున్నాంత హైప్ అయితే వచ్చేలా కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: