నటరత్న ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ కెరియర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్ని టాలీవుడ్ లోనే తనకంటూ సపరేట్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్నాడు. అలా ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. అప్పటినుంచి తను తాను స్టార్ హీరోగా మలుచుకునే పనిలో బిజీ అయిపోయారు .. కెరియర్ మొదట్లో ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు . అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఎదిగారు .. ఇక ఆపట్నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూసుకోకుండా బాలయ్య వ‌రుస‌ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.


ఇక ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాను డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో చేస్తున్నడు సంక్రాంతి కానుకగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే తన కెరీర్ లో మూడు సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే బాల‌య్య‌ కెరియర్లు రెండు భారీ డిజాస్టర్లు చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాల కారణంగా ఆయనకి వచ్చిందేమీ లేదు .. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటంటే ఒకటి మహారధి కాగా మరొకటి విజయేంద్ర వర్మ .. ఈ రెండు సినిమాలతో బాలయ్య ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిందని కూడా అంటారు.


అలాగే బాలయ్య అభిమానులు ఏ ఒక్కరు కూడా ఈ సినిమాలు చూడడానికి అసలు ఆసక్తి కూడా చూపలేదు. అదేవిధంగా ఈ  సినిమాలో బాలయ్య ఓవరాక్షన్ కూడా కొంత విస్కు తెప్పిస్తుంది . అదేవిధంగా ఈ సినిమాల్లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. అసలు ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగే ఈ సినిమాలను బాలయ్య బాబు ఎలా ఓకే చేశాడు .. ఈ సినిమాల్లో ఎలా నటించారు అంటూ సినీ విమర్శకులు ఇప్పటికీ బాల‌య్య‌ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. బాలకృష్ణను డైరెక్టర్లు హీరో  కాబట్టి వాళ్లు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. అందువల్లే ఆయనకు ఇలాంటి కొన్ని భారీ డిజాస్టర్లు కూడా వస్తూ ఉంటాయని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో లోనే బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: