నాలైయ తీర్పు సినిమాతో 18 సంవత్సరాల వయసులో హీరోగా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు . అలాగే ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు . అలాగే విజయ్ తల్లి శోభ ఈ సినిమాకు కథ అందించారు. అలానే వారు సంపాదించిన ఆస్తులన్నీ ఖర్చు పెట్టి కొడుకుతో చంద్రశేఖర్ ఈ సినిమాను తీశారు. అయితే ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి సోదరి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఆ సమయంలో శ్రీలేఖ వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే కావటం గమనార్హం.
అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా మారి నాలైయ తీర్పు సినిమాతో శ్రీలేఖ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో పాటలు మంచి హిట్ అయ్యాయి కూడా.. కేవలం 20 లక్షల బడ్జెట్ తో దళపతి విజయ్ తొలి మూవీ నాలైయ తీర్పును రూపొందించారు..కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కీర్తన హీరోయిన్‌గా నటించింది. శరత్‌బాబు, శ్రీదివ్య, రాధారవి కీలక పాత్రలు పోషించారు. 1992లో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. పది లక్షల లోపే వసూళ్లను రాబట్టి దళపతి విజయ్ తండ్రికి భారీగా నష్టాలను మిగిల్చింది . ఆస్తులన్నీ పొగొట్టింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు విజయ్ రెడీ అవుతోన్నాడు. తమిళ వెట్రి కజగమ్ పేరుతో ఓ పొలిటికల్ పార్టీని స్థాపించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు .