ఈ మధ్యకాలంలో సినిమాలో నటించే హీరోయిన్కన్నా ఐటమ్ సాంగ్ లో నటించే హీరోయిన్సే బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . కష్టపడి రెండున్నర గంట సినిమాలో కనిపించిన సరే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. తద్వారా హీరోయిన్ నెగిటివ్ టాక్ దక్కించుకుంటుంది . కానీ ఆ సినిమాలో మూడంటే మూడు నిమిషాలు ఐటెం సాంగ్ చేసిన బ్యూటీ మాత్రం బాగా పాపులారిటి సంపాదించుకొని పాన్ ఇండియా రేంజ్ లో దున్నేస్తుంది . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ "గుంటూరు కారం".


త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ లు గా శ్రీ లీల - మీనాక్షి చౌదరి నటించారు. హీరోగా మహేష్ బాబు నటించారు. అయితే ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా..ఐటెం సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.  సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. అదే ముఖ్యంగా పూర్ణ.. ఈ సాంగ్ లో మెరిసిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . స్టెప్స్ కూడా చాలా హాట్ గా వేసింది .



కాగా ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో మళ్లీ ఐటెం సాంగ్ లో నటించబోతుందట పూర్ణ . అంతే కాదు ఈ పాట కోసం ఏకంగా రెండు కోట్లు ఆమెకు ఆఫర్ చేశారట. మహేష్ బాబు సినిమాల్లో కుర్చీ మడత పెట్టే సాంగ్ కన్నా ఈ సాంగ్ మరింత నాటుగా ఉంటుంది అని.. స్టెప్స్ కూడా అదే విధంగా ఉంటాయి అని.. ఖచ్చితంగా ఈ పాట ఆమెకు మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నారు జనాలు . అంతేకాదు ఈ సాంగ్ హిట్ అయితే మహేష్ బాబు కూర్చుని మడత పెట్టేస్తుంది అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగ సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నింది.  ఇండస్ట్రీలో తనకంటూ క్రేజీ స్థానానికి క్రియేట్ చేసుకుంది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది . తర్వాత చిన్న చితకా పాత్రల్లో నటిస్తూ తన పేరుని మళ్లీ పాపులారిటీ దక్కించుకునేలా చేసుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: