కోలీవుడ్లో హీరో సూర్య పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న చిత్రం కంగువ.. ఈ సినిమాలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో మరొకసారి కనిపించబోతున్నారు సూర్య. ఇందులో హీరోయిన్గా దిశ పటాన్ని నటిస్తూ ఉన్నది. డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో చిత్ర బృందం గత రెండు రోజుల నుంచి ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమయంలో సూర్య స్టార్ హీరోల గురించి పలు విషయాలను తెలియజేశారు.




ప్రభాస్ (Prabhas) గురించి చెబుతూ.. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ తెలిపారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గురించి మాట్లాడుతూ.. ఆయన రీల్ లైఫ్ రియల్ లైఫ్ రెండింటిలో కూడా ఒకేలా ఉంటారు.  ఆయన చాలా మంచి మనిషి అని తెలిపారు.

మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాము. మహేష్ నా  జూనియర్ .అయితే స్క్రీన్ పై అతడి ఆటిట్యూడ్ నాకు ఇష్టం అంటూ తెలిపారు.

అల్లు అర్జున్ (Allu Arjun) గురించి మాట్లాడుతూ.. నేను బన్నీ డాన్స్ కి పెద్ద అభిమానిని. మంచి హార్డ్ వర్కర్. పుష్ప -2 గురించి ఎదురు చూస్తున్నాను. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ లాగా సిగ్నేచర్ డైలాగ్ కొట్టారు.

రామ్ చరణ్ (Ram Charan)గురించి మాట్లాడుతూ.. ఆయన చేసింది 15 సినిమాలే అయినా గ్లోబల్ స్టార్ అయిపోయారు. నాకు తమ్ముడు లాంటివాడు ఆయన సక్సెస్ చూసి ఆనందిస్తున్నాను అని తెలిపారు.


కంగువ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తూ ఉన్నారు. సూర్య తన కెరీర్ లో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు. మరి కంగువ సినిమా ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.ఒకస్టార్ హీరో అయ్యుండి సూర్య ఇలా ఇతర హీరోల గురించి మాట్లాడడంతో ఆయన అభిమానులు కూడా హాట్సాఫ్  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: