మహానటి సావిత్రి గురించి తెలుగు వారికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లె మండలం చిర్రావూరులో 1934 డిసెంబర్ 6న మహానటి జన్మించారు. 1950లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1971 వరకు వందల సంఖ్యలో సినిమాలు చేసింది నటి సావిత్రి. సంసారం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.అప్పుడు తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండేవి.అలాంటి సమయంలో కూడా తెలుగునటిగా...సావిత్రి చాలా మంచి పేరు తెచ్చుకుంది.ఇదిలావుండగా సినీ వినీలాకాశంలో వెలిసిన ఓ ధృవతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా లేదు. ఆమె అందుకోలేని ఆస్తులే లేవు. కానీ వాటిని పదిలపరచుకోలేని అశక్తురాలు. తరగని దరహాసం ఆమెకు దేవుడిచ్చిన వరం. ప్రేక్షక జనం ఆమెను మహానటిగా గుర్తించి మంగళహారతులు పట్టారు. కానీ ఆమెకు దగ్గరి బంధువులమని, స్నేహితులమని చెప్పుకొనే వాళ్ళు మాత్రం ఆమె ఆస్తుల మీద కన్నేసి ఆమెను నైరాశ్యంలోకి నెట్టేశారు. 

నిజ జీవితంలో నటన అంటే తెలియని అమాయకురాలు సావిత్రి.పందొమ్మిది నెలలు కోమాలో వుండి చనిపోయింది సావిత్రి.ఈ నేపథ్యంలో ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. సావిత్రి అంత్యక్రియలకు ఎంజీఆర్, ఏఎన్నార్, జయసుధ, గుమ్మడి, భారతీ రాజా తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు సావిత్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్ళు, ప్రేమ తరంగాలు చిత్రాల్లో సావిత్రి నటించారు. అయినప్పటికీ చిరంజీవి సావిత్రి అంత్యక్రియలకు హాజరు కాలేదని సమాచారం. ఈ తరం నటుల్లో బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారట. అందుకు కారణం... ఎన్టీఆర్ వెళ్లలేకపోయారట. ఆ కుటుంబం నుండి బాలకృష్ణ వెళ్లారట.ఇదిలావుండగాసావిత్రి చివరి రోజుల్లో ఆమెను చూసేవారు, ఆదరించేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను మహానటి టైటిల్ తో తెరకెక్కించారు. 2018లో విడుదలైన మహానటి బ్లాక్ బస్టర్ హిట్. తెలుగుతో పాటు తమిళంలో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. మహానటి సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ ని జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: