ప్రభాస్.. డార్లింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పటికి బోర్ కొట్టదు . ఆయన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు జనాలు. మరి ముఖ్యంగా రెబల్  ఫ్యాన్స్ ప్రభాస్ కి సంబంధించిన ఏ వార్త వైరల్ అయినా సరే ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు . ప్రభాస్ ప్రవర్తన మర్యాద కూడా అలానే ఉంటాయి.  ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు . మర్యాదల విషయంలో మనోడు తగ్గేదేలే అంటూ దూసుకుపోతూ ఉంటాడు . 


ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా ..రాజు నిజంగా రాజు ..ఎక్కడున్నా రాజే . ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి రారాజు అంటూ సినిమాటిక్ డైలాగ్స్ కూడా కొడుతూ ఉంటారు.  కాగా రీసెంట్ గానే తన 45వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్న ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా హల్చల్ చేస్తుంది. ప్రభాస్  అందరినీ డార్లింగ్ అంటూ పిలుస్తూ ఉంటారు . ఆ విషయం మనకు బాగా తెలుసు. దాని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. కానీ ఒకే ఒక హీరోని మాత్రం బావ అంటూ పిలుస్తారట . అది ఎవరో కాదు సీనియర్ హీరో "మోహన్ బాబు".



ఎస్ సీనియర్ హీరో మోహన్ బాబును బావ అంటూ పిలుస్తాడట ప్రభాస్ . దానికి కారణం "బుజ్జిగాడు" సినిమా . బుజ్జిగాడు సినిమాలో త్రిష బ్రదర్ గా మోహన్ బాబు నటించారు. త్రిషని ప్రభాస్ లవ్ చేస్తాడు ఈ సమయంలోనే ప్రభాస్ ..మోహన్ బాబు, త్రిష వాళ్ళ అన్నయ్య అని తెలుసుకొని తెగ సంబర పడతాడు. "డార్లింగ్ నువ్వు నాకు బావ  అవుతావు " అంటూ కామెడీని పండిస్తూ బావ బావ అంటూ పిలుస్తాడు . అయితే అదే అలవాటు ప్రభాస్ కి సినిమా తర్వాత కూడా వచ్చేసిందట . ఇప్పటికి మోహన్ బాబు గారు ఎక్కడ కనిపించినా సరే బావ అంటూ సరదాగా పిలుస్తూ ఆటపట్టిస్తూ ఉంటాడట . మోహన్ బాబు కూడా ఏ విషయం అయినా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ తో చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . ప్రభాస్ పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వైరల్ గా మారింది. అనుష్క - ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ డే ఎప్పుడు వస్తుందో చూద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: