మన తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర రచయితల్లో ముల్లపూడి వెంకటరమణకు ప్రత్యేకక స్థానం ఉంది.. ఆయన శైలి అక్షరాల్లో చూపించే సొగసు, వ్యంగ్యం.. ఇవన్నీ మాటల్లో చెప్పే మధుర అనుభూతులు కావు. స్వతహాగా సరస్వతి పుత్రులకు ముక్కు మీద కోపం ఉంటుందని అంటారు. వారిని చుట్టుకున్న మాట అంటే చాలు వారు సీరియస్ అయిపోతారు. ఇక ముళ్ళపూడి వారికి కూడా ఈ గుణం కొంత ఉంది. ఓ సినిమా షూటింగ్లో అది బయటపడింది. గుడి గంటలు సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నందమూరి తారక రామారావు గారు హీరో.. ఈ సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా ఉన్నారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్.. చైన్ స్మోకర్.. ఎప్పుడు హీరో చేతిలో సిగరెట్ వెలుగుతూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్‌కు సిగరెట్ తాగే అలవాటు అసలు లేదు. కానీ ఈ సినిమా కోసం ఆయన అది అలవాటు చేసుకున్నారు. ఇంకా ఎన్టీఆర్సినిమా షూటింగ్ సెట్‌లో  అడుగుపెట్టగానే ఓ కొత్త సిగరెట్ పెట్టి ఆయన టేబుల్ మీద ఎప్పుడూ ఉండాల్సిందే. సినిమా కోసమే అయినా షూటింగ్లో ఎన్ని సిగరెట్లు కాల్చాలి?  అనేది కూడా అన్నగారికి ఒక లెక్క.. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో పనిచేసే వారిలో చాలా మందికి సిగరెట్ అలవాటు ఉండేది. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ కోసం ఉంచిన సిగరెట్ పెట్టి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.


అయితే ఒక రోజు ముళ్ళపూడి వెంకటరమణ గారు షూటింగ్ చేసే ప్రదేశానికి వచ్చారు. అయితే ఈయనకు సిగరెట్ అలవాటు ఉంది. ఎన్టీఆర్ కోసం అలా ఉంచిన సిగరెట్ డబ్బా ఆయనకు కనిపించేసరికి ముళ్ళపూడి వారి మనసు దానిపై లాగింది. అక్కడ వారు అది ఎన్టీఆర్ కోసం పెట్టిన డబ్బా ముట్టుకుంటే ఆయనకు కోపం వస్తుందని.. అక్కడ వారు  ఆయనను వారించారు అయినా కూడా ఎన్టీఆర్‌కు ముళ్ళ‌పూడి వారికి మంచి స్నేహం  ఉంది ఆయనకు మనం ఏంటో తెలుసు కదా.. రచయితగా గౌరవం కూడా.  మనల్ని ఏం అనరులే' అనే ధైర్యంతో వెంటనే ఆ డబ్బా ఓపెన్ చేసి ఒక సిగరెట్ను ఊదిపాడేశారు. ఆ తర్వాత మరొకటి అలా ఒకేసారి నాలుగు సిగరెట్లను అవగొట్టేశారు.


ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్టీఆర్ షూటింగ్ సెట్‌కి వచ్చారు. దర్శకుడు షార్ట్ ఓకే అన్నారు.. ఎన్టీఆర్ సిగరెట్ డబ్బా కోసం వెతికారు అయితే అది అప్పటికి ఓపెన్ చేసి కనిపించింది. అలాగే అందులో కొన్ని సిగరెట్లు ఖాళీ అయి కనిపించాయి. ఇక ఎన్టీఆర్‌కు వెంటనే విపరీతమైన కోపం వచ్చేసింది. అసలు ఈ పని చేసింది ఎవరు.. అని సెట్లో వారి మీద అరిచారు. ఇక ముళ్ళపూడి వారు కూడా పక్కనే ఉన్నారు. ఆయన సిగరెట్లు కాల్చారాన్ని సంగతి ఆయనకు అర్థమైంది. అయినా ఎన్టీఆర్ కోపం అసలు తగ్గలేదు. నాకోసం అక్కడ పెట్టిన సిగరెట్లు అసలు ముట్టుకోకూడదని తెలియదా.. ఇది నిర్మాత డబ్బును  కష్టా జీతం దానికి వ్యాల్యూ ఇవ్వండి వాళ్ళ కష్టాన్ని గౌరవించండి గుర్తించండి.. మీరు నిర్మాత అయితే గాని ఈ బాధ తెలీదు అంటూ పెద్ద గొంతుతో అరిచారు. దాంతో అక్కడ షూటింగ్ సెట్లు అందరూ ముందు ముళ్ళపూడి వారి పరువు పోయినట్టు అయింది. ఆయన తన మొహం చిన్న బొచ్చుకొని పక్కకు వెళ్ళిపోయి కూర్చున్నారు.


ఆ తర్వాత ఆ సినిమా నిర్మాత ముళ్ళపూడి వారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన శాంతించలేదు.. నిర్మాత డబ్బుకు నేను వాల్యూ ఇస్తా .. ఏమో ఎవరు ఏం చెప్పగలరు.. రేపే మాపో నేను నిర్మాత అవ్వచ్చు నా చేతుల మీదుగా రెమ్యూనిరేషన్లు కూడా ఇస్తానేమో.. ఎన్టీఆర్ ఉన్నా సరే నాగేశ్వరరావు తో సినిమాలు తీస్తానేమో అంటూ అక్కడి వారితో ఛాలెంజ్ కూడా చేశారు. అయితే పైన తధాస్తు దేవతలు ఇదంతా విన్నారేమో కానీ వాళ్ళు ముళ్లపూడి వారిని ఆశీర్వదించారు. అలా కొన్ని రోజులకు నిజంగానే ముళ్ళపూడి వారు నిర్మాత అయ్యారు. విచిత్రంగా ఆయన నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు చేశారు కా నీ.. ఎన్టీఆర్ తో ఉన్న వారి బంధాలునైతే తెంచుకోలేదు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ సినిమాలకు మల్లపూడి గారు పనిచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బాబు - రమణ లకు తగిన రీతిలో గౌరవించారు. అయితే ఆ రోజు నేను ఆ మాటలు అలా  ఎలా అన్నానో అసలు నాకే తెలీదు . వీధి నన్ను విచిత్రంగా నిర్మాతను చేసింది. తథాస్తి దేవతులు ఉంటారని నమ్మకం నా విషయంలో నిజమైంది అంటూ ఆయన ఆత్మ కథలో రమణ గారు రాసుకోవచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: