అక్కినేని మనవడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళమెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు.  దీనికి సంబంధించిన న్యూస్ లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూమెంట్ లోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా నాగచైతన్య - శోభిత ల  పెళ్లి డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు నాగచైతన్య తన పెళ్లి కార్డు కానీ పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు.


నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేశారు . ఆ తర్వాత శోభితాతో  ఉన్న ఒక పిక్చర్ షేర్ చేశారు . అయితే హీరోయిన్ సాయి పల్లవి ను అక్కినేని నాగార్జున.. నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లికి ఇన్వైట్ చేసినట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. "అమరన్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది . దీనికి సంబంధించిన ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది . సాయి పల్లవి లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు సాయి పల్లవిని ఓ రేంజ్ లో పొగిడేశాడు నాగార్జున .



అయితే షూట్ అయిపోయిన తర్వాత నాగార్జునతో చిట్ చాట్ చేసిన సాయి పల్లవిను ఆయన స్పెషల్ గా నాగచైతన్య -శోభిత  ధూళిపాల పెళ్లికి ఇన్వైట్ చేశారట . అంతేకాదు నాగచైతన్య కూడా తండేల్ షూటింగ్లో భాగంగా సాయిపల్లవి కి తన లవ్ మేటర్ చెప్పాడట . అంతేకాదు పెళ్లికి తప్పకుండా రావాలి అంటూ కూడా ఇన్వైట్ చేశారట . ఇదే న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది.  సాయి పల్లవి అంటే మొదటి నుంచి తెలుగు హీరోస్ రానా దగ్గుబాటి అదేవిధంగా నాగచైతన్య కి బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . ఆమెను పెళ్లికి ఇన్వైట్  చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంతలా కుదిరిందో అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . సాయిపల్లవి - నాగచైతన్య తండేల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: