మన తెలుగు చత్ర పరిశ్రమలో మధ్యతరం హీరోయిన్లలో శ్రీదేవి - జయప్రదలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇద్ద‌రు ఒకరిని మించి ఒకరు తమ అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాల్లో ఉన్నారంటే.. ఆ రోజుల్లో ఆ సినిమాకి జనాలు క్యూ కట్టేవారు. అలా తమ అందచందాలతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి - జయప్రద.. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటారు.. అలా అని అప్పట్లో వీరి మధ్య కోల్డ్ వార్‌ కూడా జరిగేదని అంటారు. చిత్ర పరిశ్రమలో శ్రీదేవి - జయప్రదలో సీనియర్ ఎవరు అంటే శ్రీదేవి అని అంటారు. నాలుగు సంవత్సరాల వయసు నుంచి సినిమాలు నటిస్తుంది శ్రీదేవి 1975లో వచ్చిన అనురాగాలు సినిమాలో శ్రీదేవి మొదటిసారి హీరోయిన్గా నటించింది. ఇక అంతకు ముందు సంవత్సరమే భూమి కోసం సినిమాలో జయప్రద హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ విధంగా చూస్తే శ్రీదేవి కంటే జయప్రద  హీరోయిన్గా ముందుగా మొదటి స్టార్ట్డం తెచ్చుకుంది. 1977లో వచ్చిన అడవి రాముడు సినిమాతో ఒకసారిగా టాప్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళిపోయింది.


ఇక శ్రీదేవి మాత్రం హీరోయిన్గా మొదటి సినిమా చేసిన మూడు సంవత్సరాలు తర్వాత పదహారేళ్ళ వయసు సినిమాతో మంచి మార్కులు అందుకుంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన వేటగాడు సినిమాతో శ్రీదేవి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇలా ఇద్ద‌ర‌కి ఎన్టీఆర్ సినిమాల తోనే స్టార్డం రావడం ఇక్కడ మరో విశేషం. అలాగే అదే సంవత్సరం కృష్ణ హీరోగా వచ్చిన బుర్రుపాలెం బుల్లోడు సినిమాలో కూడా శ్రీదేవి హీరోయిన్గా ఎంపికైంది. అయితే నిజానికి ఈ సినిమాల్లో ముందుగా జయప్రదను హీరోయిన్గా భావించారటరట. అలాగే ఆమెకు 5000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు.. కాని తర్వాత ఆమె ప్లేస్ లో శ్రీదేవిని తీసుకున్నారు. అయితే ఇద్ద‌రి మధ్య విభేదాలు రావడానికి ఇది కూడా ఒక కారణమని కూడా అంటారు. అప్పటినుంచి ఇద్దరు మధ్య పోటీ నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు వ‌రుస‌ సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే తెలుగులో వచ్చిన దేవత సినిమాను చూస్తే మాత్రం అక్కాచెల్లెలుగ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మన నిజ జీవితంలో ఉండే అక్కా చెల్లెలు కూడా ఇంత అన్యోన్యంగా ఉండరు అనే అంతగా పేరు తెచ్చుకున్నారు.


అయితే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లు చేసే సమయంలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న ఇద్దరు షార్ట్ అవగానే మాత్రం ఎడమహం పెడ మొహం గా ఉండేవారట. అయితే  జయప్రద ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఇద్దరం మాట్లాడుకోం. నిజం చెప్పాలంటే శ్రీదేవి కొంచెం యారగెంట్‌గా ఉండేది. ఇద్దరం షాట్‌లో పోటాపోటీగా నటించినా.. ఒక్కసారి లైట్స్‌ ఆఫ్‌ అయిపోతే ఆమె కుర్చీ అటు, నా కుర్చీ ఇటు ఉండేది. ముఖ్యంగా  హిందీలో ‘మక్సద్‌’ అనే సినిమా ఇద్దరం కలిసి చేశాం. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో హీరో జితేంద్ర మమ్మల్ని కలిపేందుకు ట్రై చేశారు. మా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి బయట తాళం కూడా వేశారు. అలా గంట సేపు మమ్మల్ని ఒకే గదిలో ఉంచారు. కానీ, ఆ గంట సేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేదు’ అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: