ఇక అసలు జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని .. ఆమె విషయంలో కూడా ఏ తప్పు జరిగి ఉండదని.. ఎప్పటినుంచో తనపై అత్యాచారం జరుగుతుంటే మరి ఆమె ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందంటూ కూడా పలువురు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదైన తర్వాత ఆయనను జనసేన పార్టీ నుంచి తప్పించారు అధినేత పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో జానీ మాస్టర్ కు మరో ఊహించిన షాక్ కూడా తగిలింది .. ఆయనకు రావాల్సిన జాతియ అవార్డు కూడా అవార్డు కమిటీ రద్దు చేసింది. ఆ సమయంలో కూడా మధ్యంతర బెయిల్ వచ్చిన జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు రాలేదు.
శుక్రవారం ఆయనకు బెయిల్ రాగా శనివారం జైలు నూంచి విడుదలయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా జానీ మాస్టర్ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు విజయవాడ వెళ్ళబోతున్నారట. అసలు ఆయన వ్యవహారంలో ఏం జరిగింది.. అసలు వాస్తవాలను పవన్ కు ఆయన వివరించనున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత కొన్ని సాక్షాలతో ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ తో జానీ మాస్టర్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుందో చూడాలి .