స్వేత తనువు కలిగిన తమన్నా గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తమన్నా అందచందాలన్నా, డాన్సులు అన్నా తెలుగు సినిమా ప్రేక్షకులకు వీనులవిందులా అనిపిస్తాయి. అందుకే గత రెండు దశాబ్దాలుగా ఆమె ఇక్కడ తన ఉనికిని చాటుకుంటోంది. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా యావత్ ఇండియన్ చిత్ర పరిశ్రమల అన్నింటిలో కూడా తనదైన మార్క్ ని వేసుకొంది. ముఖ్యంగా డాన్సుల విషయంలో ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆమె ఓ వైపు సినిమాలలో కథానాయికగా నటిస్తూనే, ప్రత్యేకమైన పాటలలో నర్తించడం కోసం ఆమె డేట్స్ కావాలని ఆరాటపడుతూ ఉంటారు చిత్ర దర్శకులు. అందుకే ఆమెకి నేటికీ డిమాండ్ ఉంది. మొన్నటికి మొన్న రజనీ నటించిన 'జైలర్' సినిమాలోని ఓ ఆమె ఓ పాత్ర పోషిస్తునే, ఓ ప్రత్యేక పాటలో నర్తించిన సంగతి విదితమే.
అయితే, ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అభిమానులను తన అందాలతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తమన్నా పింక్ కలర్ లెహంగాలో గ్లామర్ ఫుల్ లుక్ లో వీనులవిందు చేసింది. దాంతో టాలీవుడ్ జనాలు గిలగిలా కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ డిజైనర్లు అబూ జానీ-సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ లో ఆమె తనువు తారాజువ్వలా వెలిగిపోతోంది. దీపావళి కానుకగా తన ఇన్స్టాగ్రామ్లో ఈ పిక్స్ షేర్ చేసిన తమన్నా, అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన 'ఫుల్ఝాది' అని క్యాప్షన్ తో పేర్కోవడం విశేషం.
తమన్నా కెరీర్ విషయానికొస్తే, తెలుగులో ‘హ్యాపీ డేస్’ అనే చిత్రం చేసిన తమన్నా తనదైన మార్క్ వేసుకుంది. ఆ సినిమా తరువాత తమన్నాకి ఇక్కడ వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. ఈ క్రమంలో చిన్న చిన్న హీరోలను మొదలుకొని... సూపర్ స్టార్, పవర్ స్టార్లతో ఇక్కడ నటించి మెప్పించింది. 100% లవ్, కెమెరా మేన్ గంగతో రాంబాబు, బాహుబలి, ఎఫ్2, సైరా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది తమన్నా. తాజా ఫోటో షూట్లో తమన్నా ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణను ప్రదర్శించింది. సాంప్రదాయ, ఆధునికత మేళవింపుతో అభిమానుల మనసులు దోచుకుంటున్న ఈ లుక్ లో తమన్నా డీప్ పింక్ డ్రెస్సులో యాక్సెసరీస్ తో కలిసి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.