స్టార్ హీరో బాలయ్య అఖండ సినిమాలో ఏ నిమిషంలో నటించాడో కానీ అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా ప్రతి విషయంలో తిరుగులేదు. వీరసింహారెడ్డి యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టగా భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అన్ స్టాపబుల్ షొ మూడు సీజన్లు హిట్ కాగా సీజన్4 కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయిందని భోగట్టా.
 
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ సైతం రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్యకు త్వరలో పద్మ భూషణ్ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ బాలయ్య స్టూడియో నిర్మిస్తారని అందుకు సంబంధించిన భూముల కేటాయింపు సైతం జరగనుందని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు.
 
స్టార్ హీరో బాలయ్య కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. బాలయ్య పారితోషికం సైతం 35 కోట్ల రూపాయలకు చేరింది. బాలయ్య రేంజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. లుక్స్ విషయంలో కానీ గెటప్ విషయంలో కానీ బాలయ్య ప్రస్తుతం అస్సలు రాజీ పడటం లేదు. బాలయ్య తర్వాత సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
 
బాలయ్య సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా మరికొన్ని సంవత్సరాల పాటు బాలయ్యకు తిరుగు లేదని బాలయ్యకు లక్ మాత్రం ఊహించని స్థాయిలో ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరో నాలుగేళ్లు కచ్చితంగా హిట్టయ్యే క్రేజీ ప్రాజెక్ట్ లతో
వరుస సినిమాలతో బాలయ్య బిజీగా ఉండనున్నారని భోగట్టా. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: