తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయాలను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు సూర్య హీరోగా కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఈ దర్శకుడు తెలుగు లో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు ఏవి ..? అవి ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

శివ చాలా సంవత్సరాల క్రితం గోపీచంద్ హీరోగా త్రిష హీరోయిన్గా రూపొందిన శంఖం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత కాస్త ఎక్కువ కాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత రవితేజ హీరోగా తాప్సి హీరోయిన్గా దరువు అనే మరో తెలుగు సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దరువు సినిమా తర్వాత ఈయన పూర్తిగా తమిళ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. దరువు తర్వాత ఒక్క తెలుగు సినిమాకు కూడా ఈయన దర్శకత్వం వహించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ దర్శకత్వం వహించిన కంగువా సినిమా పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సూర్య హీరోగా రూపొందిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: