మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించింది. ఎస్ జే సూర్యమూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ దీపావళికి ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా నుండి టీజర్ కమింగ్ సూన్ అని తెలియజేస్తూ నిన్న ఈ మూవీ బృందం ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఈ సినిమా మరో 75 రోజుల్లో విడుదల కానున్నట్లు కూడా ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ పోస్టర్లో రామ్ చరణ్ కుర్చీలో కూర్చొని ఉండగా అతని వెనుక నుండి ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. అందులో రామ్ చరణ్ కుర్చీలో కూర్చొని ఉంటే అతని పైకి వందల మంది మారణాయుధాలను పట్టుకొని వస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. రామ్ చరణ్ హీరోగా రూపొందిన మగధీర సినిమాలో కూడా ఇలాంటి ఒక షాట్ ఉంటుంది. అది బ్లాక్ బాస్టర్ అయ్యింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా ఇలాంటి ఒక షాట్ ఉంటుంది. అది బ్లాక్ బస్టర్ అయింది. ధ్రువ సినిమాలో కూడా ఇలాంటి ఒక షాట్ ఉంటుంది. అది బ్లాక్ బాస్టర్ అయ్యింది. దానితో చరణ్ అభిమానులు ఈ ఫోటోలన్నింటినీ పక్కన పెట్టి గేమ్ చేంజర్ మూవీ లోని ఈ ఫోటోను పక్కన పెట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని వైరల్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: