తెలుగు సినీ పరిశ్రమ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు . ఈయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్ విజయాలను అందుకున్నాయి . రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా మూవీలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి . ఇందు లో రామ్ చరణ్ తో రాజమౌళి రూపొందించిన మగధీర ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కాగా , ప్రభాస్ తో రూపొందించిన బాహుబలి సినిమా కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది . లేక పోతే రాజమౌళి తన కెరియర్లో ఎక్కువ సినిమా లను జూనియర్ ఎన్టీఆర్ తో చేశాడు.

రాజమౌళి మొదటగా జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 , ఆ తర్వాత సింహాద్రి , యమదొంగ , ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలను రూపొందించాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన ఒక్క ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా లేదు. రాజమౌళి ఈయనతో ఎన్నో సినిమాలను రూపొందించిన ఆయన కూడా ఈయనకు ఇండస్ట్రీ హిట్ ను ఇవ్వలేకపోయాడు. ఇకపోతే తారక్ అభిమానులు అంతా కూడా ఎన్టీఆర్ కి ఎన్ని విజయాలు ఉన్న ఒక్క ఇండస్ట్రీ హిట్ వస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దానితో చాలా మంది మరి కొంత కాలం లోనే తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటాడు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి తారక్ ,  ప్రశాంత్ నీల్ మూవీతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటాడో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: