మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత అన్నదమ్ములు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే తన సోదరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ను వెండి తెరకు పరిచయం చేశాడు. చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం కాగానే ఈయనకు మంచి క్రేజ్ లభించింది. అలాగే పవన్ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తూ ఉండడంతో చాలా తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉంది.

పవన్ కళ్యాణ్ ఏ దర్శకుడితో అయినా సినిమా చేస్తాను అని అతనికి మాట ఇచ్చాడు అంటే అతని బ్యాగ్రౌండ్ పట్టించుకోకుండా అతనికి ఆ ముందు సినిమాల ద్వారా హిట్లు ఉన్నాయా ... ప్లాపులు ఉన్నాయా అనేది ఏ మాత్రం లెక్క చేయకుండా ఇచ్చిన మాట మీద నిలబడుతూ అతనికి సినిమాలు చేస్తూ ఉంటాడు అనే గొప్ప పేరు కలిగి ఉంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ "గుడుంబా శంకర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వీర శంకర్ దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఆ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ తో చిరంజీవిసినిమా వద్దు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పాడట. దానితో పవన్ కళ్యాణ్ వీర శంకర్ కి సినిమా చేస్తాను అని మాట ఇచ్చాను. చేయకపోతే బాగుండదు. హిట్టు , ఫ్లాపు పెద్ద విషయం కాదు అని ఇచ్చిన మాట కోసం అతనితో సినిమా చేశాడట. కానీ గుడుంబా శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు ... యావరేజ్ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ,  ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజీ మూవీలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: