అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు.. తండ్రి అండ వున్నా కూడా తనదైన శైలిలో నాగార్జున హీరోగా రాణించాడు.. సినిమాలలో తనకుంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్యలకు పోటీగా వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు.. బాలయ్య, చిరు ఎంత ఫామ్ లో వున్న నాగార్జున క్రేజ్ సంపాదించుకున్నాడు..వరుస హిట్స్ అందుకొని స్టార్ హీరోగా మారాడు .అందువల్లే నాగార్జున ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ డైరెక్టర్స్ ను సైతం తన ప్రోత్సాహం అందించే వారు..ప్రస్తుతం నాగార్జున హీరోగా, బిగ్ బాస్ షో కి హోస్ట్ చేస్తూ బిజీ గా గడుపుతున్నారు.. ప్రస్తుతం నాగార్జున లోకేష్ కనగరాజ్, రజనీ కాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు హీరో గా అలరించిన నాగ్ ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషిస్తూ ఉండడం విశేషం…రజినీకాంత్ లాంటి నటుడి సినిమాలో ఆయన విలన్ పాత్రను పోషించడమనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయనకు తమిళంలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ కానుంది.

కూలీ సినిమాతో పాటుగా నాగ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘కుబేర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలని నాగ్ చూస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే తను హీరోగా ఇప్పటికే 99 సినిమాలు చేశాడు. ఇక 100 సినిమా కోసం నాగార్జున భారీ కసరత్తులు చేస్తున్నప్పటికి ఆ సినిమాను ఎవరితో చేయాలి అనే విషయంలోనే తను చాలా వరకు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తన కెరీర్ మైల్ స్టోన్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని నాగ్ ఆలోచిస్తున్నాడు.కొంతమంది దర్శకులను సినిమా కోసం తీసుకున్నప్పటికి వాళ్ళు ఎవరూ కూడా ఆ సినిమాకి సెట్ అవ్వరు అనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడు. ఇక మొత్తానికైతే తను ఒక స్టార్ డైరెక్టర్ తోనే ఈ సినిమా చేయడానికి సన్నాహలు చేసుకుంటున్నట్టుగా సమాచారం.. రీసెంట్ గా’ దేవర’ తో భారీ సక్సెస్ లను అందుకున్న కొరటాల శివకు ఈ సినిమా భాద్యత అప్పగించేందుకు నాగ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: