కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన స్క్రీన్ ప్లే తో ఎన్నో మ్యాజిక్ను చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన వాడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. లోకేష్ , సందీప్ కిషన్ హీరోగా రెజీనా కేసాండ్రా హీరోయిన్ గా మా నగరం అనే సినిమాతో మూవీ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన కార్తి హీరోగా ఖైదీ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యే అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో లోకేష్ కనకరాజు క్రేజ్ ఒక్క సారిగా అమాంతం పెరిగిపోయింది. ఇక ఖైదీ మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా మాస్టర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే మూవీని రూపొందించాడు. ఈ మూవీని  పాన్ ఇండియా మూవీగా విడుదల చేయగా ఈ మూవీ అదిరిపోయి రేంజ్ విజయాన్ని సాధించింది. ఈ మూవీతో కమల్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రాగా ... లోకేష్ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈయన లియో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్  , రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మా నగరం సినిమా సమయంలో ఈయనను పట్టించుకున్న వారి సంఖ్య తక్కువ. కానీ ఇప్పుడు మాత్రం లోకేష్ కనకరాజు తో సినిమా చేయాలి అని అనుకునే స్టార్ హీరోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా లోకేష్ తో సినిమా చేయాలి అనే స్థాయికి ఆయన ఎదిగాడు. ఇలా ఎవ్వరు పట్టించుకోని స్థాయి నుండి ప్రస్తుతం అందరూ తన వెంటపడే స్థాయికి లోకేష్ కనకరాజు పెంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: