- కలర్ లేదని ఛీత్కరించారు..
- సినిమా రంగంలోనే సరికొత్త కలర్లు ఇచ్చాడు..
-  డైరెక్షన్ రంగంలోనే అగ్రగన్యుడు అట్లీ..

 ప్రస్తుతం చలనచిత్ర రంగంలో  ఇండియా మొత్తంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు.  ఇందులో టాప్ 5 డైరెక్టర్లలో అట్లీ కూడా నిలుస్తారు. చూడటానికి  బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి అట్లీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వీడి మొహానికి సినిమా తీస్తాడా అని చాలా మంది ఛీత్కరించారు. కానీ అట్లీ మాత్రం  అవేవీ పట్టించుకోకుండా సినిమా రంగంలోనే  అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకొని దూసుకుపోతున్నారు. అలాంటి అట్లీ గురించి కొన్ని వివరాలు చూద్దాం..

 డైరెక్షన్ రంగాన్నే శాసించాడు..

 అట్లీ డైరెక్షన్లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా అద్భుతమైన హిట్ తప్ప ఫ్లాప్ అనే ముచ్చటే లేదు. ఆ విధంగా డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి అట్లీ ఎన్నో మహాద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడంలో  ముందుకు వెళ్లారని చెప్పవచ్చు. అలాంటి అట్లీ గురించి కొన్ని వివరాలు చూద్దాం..  అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. కానీ అందరికీ అట్లీగా పరిచయమయ్యాడు. 1986 సెప్టెంబర్ 21న జన్మించిన ఈయన తమిళ ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి ఎస్. శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత మొదటిసారి ఆయన  రాజా రాణి అనే సినిమా ద్వారా డైరెక్షన్ రంగంలోకి పూర్తిస్థాయి గా అడుగుపెట్టి  అద్భుతమైన హిట్ సాధించారు. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ  84 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత తేరీ అనే సినిమా ద్వారా మన ముందుకు వచ్చాడు.


 ఈ సినిమా 75 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్స్ సాధించి  అట్లీ పేరును ఎక్కడికో తీసుకెళ్ళింది. మూడవ సినిమా మెర్సల్  తెలుగులో అదిరింది అనే పేరుతో రిలీజ్ అయింది. 120 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 260 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత బిగిల్ తెలుగులో విజిల్ అనే పేరుతో సినిమా వచ్చింది. 180 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 305 కోట్లు సాధించింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరో మూవీ జవాన్. 2023 రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. కానీ ఈ మూవీ ఏడు రోజుల్లోనే 614 కోట్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం అట్లీ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగిపోతుంది. ఇక ఈయనతో సినిమా చేయడానికి కూడా చాలామంది హీరోలు ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: