కాగా సీనియర్ ఎన్టీ రామారావు గారికి మొదటినుంచి ఒక గుణం . ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అది ఎవరైనా సరే ఫేస్ టూ ఫేస్ చెప్పేస్తాడు . అది తనకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా పరిచయం లేని వ్యక్తి అయినా. అయితే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి గారి కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో మనకు తెలుసు . అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
అన్నా చెల్లెలుగా అయినా .. భార్యాభర్తలు గా అయినా ఏదైనా సరే ఆ రోల్స్ లో జీవించిపోయేవారు. సినిమాకే ప్రాణం పోస్తారు. అలాంటి ఒక అద్భుతమైన నటన ఈ ఇద్దరు నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . అయితే జెమినీ గణేషన్ ని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోబోతుంది సావిత్రి .. అంటూ ఎన్టీఆర్ కు తెలియగానే ఆయన సావిత్రి గారి వద్దకు వెళ్లి.." నువ్వు చేస్తుంది తప్పు నీకు మంచి ఫ్యూచర్ ఉంది ..ఇలా చేయకు అంటూ చాలా చాలా నచ్చచెప్పారట. తొందరపాటుతో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావ్ నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటే నీ కెరియర్ కాదు నీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది అంటూ స్ట్రైట్ గానే ఆమెకు అర్థమైయే రీతిలో చెప్పుకొచ్చారట". కానీ అప్పుడు ప్రేమ మాయలో ఉన్న సావిత్రి గారు ఎన్టీఆర్ చెప్పిన మాటలను ఏది వినలేదు. అంతకుముందు వరకు ఎన్టీఆర్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా వినే సావిత్రి జెమినీ గణేషన్ విషయంలో మాత్రం వినకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంది . ఆ తర్వాత సావిత్రి గారి జీవితం ఎలా మారిపోయిందో..? ఎన్ని కష్టాలు అనుభవించిందో..? అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు మహానటి సినిమా చూస్తే ఈజీగా అర్థమయిపోతుంది..!