రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండు సెట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడంటే ప్రభాస్ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. అప్పట్లో లవ్ సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. బాహుబలి, కల్కి, సలార్ వంటి చిత్రాలతో బాగానే సక్సెస్ అవుతున్నారు ప్రభాస్. కొరటాల శివ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం మిర్చి.


ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమాకి సంగీతం హైలెట్గా నిలిచింది. మిర్చి చిత్రంలోని సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్లో సైడ్ డాన్సర్ గా ఒక హీరోయిన్ కూడా నటించింది. ఆమె టాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాల నటించి మెప్పించింది అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఎవరో కాదు నటి భాను శ్రీ. భావన శ్రీ పలు చిత్రాలను చిన్నచిన్న పాత్రలలో కూడా నటిస్తూ ఉండేది.


అయితే మిర్చి సినిమాలోని డార్లింగ్ అనే పాటకు సైడ్ డాన్సర్ గా కూడా నటించింది భాను శ్రీ. కుమారి 21ఎఫ్, మహానుభావుడు వంటి చిత్రాలలో కూడా నటించింది అలాగే బాహుబలి చిత్రంలో తమన్నాకు డూప్ గా కూడా నటించిందట. అయితే యాక్టర్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా యాంకర్ గా ఎన్నో షోలు చేసిన భాను శ్రీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది భాను శ్రీ. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏదైనా సినిమాతో రీ యంట్రి ఇస్తుందేమో చూడాలి మరి భాను శ్రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: