దర్శక ధీరుడిగా రాజమోళికి మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు. రాజమౌళి సినిమా అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తూ ఉంటారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు 1500కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి సంచలనం క్రియేట్ చేశారు.23 సంవత్సరాలలో కేవలం 12 సినిమాలు చేసి అపజయం ఎరుగని డైరెక్టర్ గా రికార్డు క్రియేట్ చేశారు.ఇదిలావుండగా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ఊహించని విజయాలు అందుకుంటున్న రాజమౌళి తాను చేసే సినిమాలలో కొన్ని షాట్స్ కాపీ చేస్తాడని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేసినా.. అవి ఏ ఎక్కడినుంచి తీసుకున్నాడు అనే విషయం అర్థం కాక కొంతమంది సైలెంట్ అయిపోయేవారు. 

అయితే ఇప్పుడు మారిన అత్యాధునిక ప్రపంచంలో రాజమౌళి తన సినిమాలలో పెట్టే సన్నివేశాలను లేదా షాట్స్ ను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది ఫ్రూఫ్స్ తో సహా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి కూడా నిజం ఒప్పుకున్నారు. తన సినిమాలలో కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాల నుంచి, ఇతర భాషా చిత్రాల నుంచి కాపీ చేస్తానని తెలిపారు.ఈ నేపథ్యంలో గత పది సంవత్సరాల క్రితమే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. దీనికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నతనం నుంచి మనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎంతలా ఉందో అందరికీ తెలుసు. నా వరకు నేను మన సినిమాలు ఆస్థాయిలో ఎందుకు ఉండవు అని మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇక ఆ సినిమాల నుంచి కాపీ కొడతావు అనే మాటకు నా సమాధానం.. అవుననే చెబుతాను. హాలీవుడ్ సినిమాలలోని కొన్ని షాట్స్ ని డైరెక్ట్ గా కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాను అంటూ ఒప్పుకున్నారు. ఏది ఏమైనా దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా కొన్ని సన్నివేశాలు కాపీ చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: