బాలీవుడ్ అందాల తార శిల్పా శెట్టి గురించి జనాలకి బాగా తెలుసు. ఆమె తన అందచందాలతో 90sలో ఓ దుమ్ముదులిపేసింది. ఈ క్రమంలో ఆమె తెలుగు సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఆమె తెలుగు హీరో వెంకటేష్ తో నటించిన 'సహస వీరుడు సాగర కన్య' సినిమా ఎలాంటి విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నాళ్ల క్రితం నటి శిల్పా, భర్త రాజ్ కుంద్రా విషయంలో అనేక ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయారు కూడా. అయితే అక్కడినుండి వీరిని కొన్ని రకాల వివాదాలు మాత్రం వెంటాడడం మానలేదు.
ఈ క్రమంలోనే శిల్ప రెస్టారెంట్ రగడ తెరమీదకి వచ్చింది. ముంబై నగరంలోని దాదర్‌లో ఆమెకి "ఫైన్ డైనింగ్ రెస్టారెంట్" ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్ పేరు "బాస్టియన్". ఇక చాలా మంది ధనవంతులు వచ్చి భోజనం చేసే ఈ బడా హోటల్లో షాకింగ్‌గా ఒక రోజు దొంగతనం జరగడం కొసమెరుపు. అవును, ఆ రెస్టారెంట్ పార్కింగ్ స్థలంలో ఉన్న సుమారు 80 లక్షల రూపాయల విలువైన కారు దొంగిలించబడిందని టాక్. ఇక కారు యజమాని బాంద్రాకు చెందిన వ్యాపారవేత్త రుహాన్ ఖాన్. శిల్పా శెట్టి రెస్టారెంట్లో భోజనం చేసి బయటకు వచ్చినప్పుడు తన 80 లక్షల విలువైన కారు దొంగిలించబడిందని ఆయన ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది.
దాంతో ఆ వ్యాపారవేత్త శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో తన కారు గురించి FIR దాఖలు చేయగా రుహాన్ తన స్నేహితులతో రెస్టారెంట్‌కు వచ్చాడని పోలీసులు కూడా తెలపడం జరిగింది. ఆ సమయంలో కారును హోటల్ బేస్మెంట్లో పార్క్ చేసి, హోటల్లో పనిచేసే ఒక వ్యక్తికి కారు కీ ఇచ్చారట. ఈ సంఘటనపై పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించి కనుగొన్నారు. ఈ క్రమంలోనే అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించి తెల్లవారుజామున 2 గంటలకు కారును దొంగిలించినట్టు గుర్తించారు. దొంగలు కారును అక్రమంగా తెరిచి, ఆపై ఒక అనుమానితుడు ఖాన్ కారును బయటకు తీసుకెళ్లడం జరిగింది. దాంతో శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యం భద్రతను మెరుగుపరచాలని పోలీసులు సూచించారు. శిల్పాకు చెందిన ఈ రెస్టారెంట్ బాస్టియన్ దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్‌లో 48వ అంతస్తులో ఉండడం గమనార్హం.