అయితే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ‘తమిళగా వెత్రి కజగం’ అనే పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ లో అడుగుపెట్టారు. అలాగే దానికి సంబంధించిన తొలి భారీ సభని కూడా ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అలాగే అందులో పది లక్షలకు పైగా జనాలు పాల్గొన్నారు. అలాగే ఆ సభలో విజయ్ తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు నన్ను ఎంతో నీచంగా చూసారని అయినప్పటికీ తాను అన్నిటిని ఓర్చుకొని తాను ఏంటో అక్కడ నిరూపించుకుని ఈ స్థాయికి ఎదిగాను. ఇప్పుడు కూడా తాను రాజకీయాల్లో అదే వైఖరితో ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇలా మొత్తానికి విజయ రాజకీయ పార్టీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే విజయ రాజకీయాల్లో విజయం సాధిస్తారో లేదో అనే విషయం తెలియాలంటే ఎలక్షన్ జరిగేంత వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు కొంత మంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విజయ్ను పోలిస్తూ వీళ్ళిద్దరికీ సమానమైన క్రేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కొంచెం లేట్ అయినా కూడా రాజకీయాల్లో తన ఎంట్రీ చాలా గ్రాండ్గా ఇచ్చాడని ఒక్కసారిగా డిప్యూటీ సీఎం గా తాను మారటం అనేది చాలా గొప్ప విషయం అంటూ మాట్లాడుతూనే విజయ్ కూడా ఈసారి గెలిచిన గెలవక పోయన మరోసారి మాత్రం తను సీఎం బరిలో నిలుస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ రాజకీయంగా ఉన్న పలుకుబడి గాని మరో లెవెల్ లో ఉందనే చెప్పాలి. మరి విజయ్ ఆ స్టాండర్డ్ లో ముందుకు దూసుకెళ్తాడా? తమిళనాడు రాజకీయ చదరంగం లో నిలబడగలుగుతాడా అనేది కాలమే చేప్పలి.