మనకు తెలిసిందే . ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ నాగ చైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లి . నాగచైతన్య ఆల్రెడి హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమెకు విడాకులు ఇచ్చేసి .. ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు . ఆగస్టు 8వ తేదీ వీళ్ళ నిశ్చితార్ధం  చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.  అంతేకాదు ఈ ఫంక్షన్ కి నాగచైతన్య ఫ్రెండ్స్ ఎవరు కూడా రాకపోవడం గమనార్హం .


కేవలం నాగచైతన్య ఫ్యామిలీ అదే విధంగా శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. కాగా నిశ్చితార్థం తర్వాత ఫొటోస్ ని షేర్ చేసి త్వరలోనే భార్యాభర్తలను కాబోతున్నాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . కాగా తర్వాత వీళ్ళ పెళ్లికి సంబంధించిన డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేయకపోవడంతో ఫాన్స్ షాక్ అయిపోయారు.  దానికి తగ్గట్టే కొండా సురేఖ ..నాగచైతన్య - సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళు పెళ్లిని బ్రేకప్ చెప్పుకున్నారా ..? అంటూ కూడా సందేహాలు వ్యక్తం అయ్యాయి .



అయితే ఎవరు ఊహించిన విధంగా శోభిత ధూళిపాళ్ల పసుపు దంచే ఫంక్షన్ కంప్లీట్ అయింది అంటూ చాలా ట్రెడిషనల్ గా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది . దీనితో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది ..ఏ విధమైన అడ్డంకుల లేకుండా అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతూ వచ్చారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో డిసెంబర్ 4వ తేదీ మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది . రీసెంట్ గా జరిగిన అక్కినేని నాగేశ్వర రావు గారి   నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్ లో ఈ విష్యం బయటపడ్డింది. అక్కినేని కాంపౌండ్ నుంచి లీకైన సమాచారం ప్రకారం.. డిసెంబర్ రెండవ తేదీ సంగీత్ ..మూడవ తేదీ మెహందీ ..నాలుగవ తేదీ పెళ్లి జరగబోతుందట . అంతేకాదు డిసెంబర్ 10వ తేదీ గ్రాండ్గా హైదరాబాదులో భారీ రిసెప్షన్ ని పెట్టబోతున్నారట.  పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. అయితే రిసెప్షన్ కి మాత్రం అటు పొలిటికల్ ఇటు సినీ ఇండస్ట్రీ ఇద్దరికీ సంబంధించిన ప్రముఖులను పిలవబోతున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండీగా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: