ఈ మధ్యకాలంలో హీరోస్ చాలా చాలా బోల్డ్  డెసిషన్ తీసుకుంటున్నారు . ఎలా అంటే తమ వయసు కన్నా పై బడే లుక్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  మొన్నటికి మొన్న హీరో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బిగ్ రిస్కే చేశాడు. రాజా సాబ్ సినిమా కోసం ఏకంగా ముసలివాడి క్యారెక్టర్ లో కనిపించడానికి సిద్ధమై అటువంటి మేకప్ వేసుకున్నాడు . దానికి సంబంధించిన పిక్చర్స్ ఎలా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోకి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ఆయన మరెవరో కాదు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ . ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు రామ్ చరణ్ . ఆయన లుక్స్ ఈవెంట్ కి హైలైట్ గా మారాయి.  కళ్ళజోడు పెట్టుకొని ఫుల్ గడ్డంతో చాలా చాలా మాస్ లుక్ లో మెగా ఫాన్స్ కు గట్టి ట్రీట్ ఇచ్చాడని చెప్పుకోవాలి . అయితే రామ్ చరణ్ ఎంట్రీ కూడా వేరే లెవెల్ లో ఉండింది. ఆ ఈవెంట్ లో చాలా చాలా  పెద్ద మనుషులు ఉన్నా కూడా అందరికన్నా హైలైట్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఉండడం రాంచరణ్ లుక్ అదే విధంగా ఆకట్టుకుంటూ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.



రామ్ చరణ్ న్యూ లుక్స్ చూసి ఫిదా అయిపోతున్నారు మెగా అభిమానులు . ఈ పిక్చర్ గేమ్ చేంజర్ కి సంబంధించింది కాదు అని బహుశా ఈ పిక్చర్ బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి సంబంధించి అయ్యి ఉండొచ్చు ..లేకపోతే సుకుమార్ సినిమాకి సంబంధించింది అయినా ఉండొచ్చు అంటూ గెస్ చేస్తున్నారు. అయితే ఆర్ సి 16 చిత్రం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది .మూడు పాటలు కూడా పూర్తి చేసుకుంది . మరి కొద్ది రోజుల్లోనే చిత్ర షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ చాలా మాస్ గా ఉండబోతున్నాయి అంటూ ఈ సినిమా ఫుల్ రచ్చ రంబోలా చేయబోతుంది అంటూ మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: