గతనెల 27న ప్రేక్షకులు ముందుకు వచ్చిన దేవర తొలి రోజు అర్ధరాత్రి తర్వాత వాస్తవంగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అంతా అంచనాలు అందుకోలేదని.. ఎన్టీఆర్ అభిమానులు సైతం కాస్త డీలాపడ్డారు. అయితే ఎన్టీఆర్ సింగల్ హ్యాండ్‌తో దేవర సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేశారు. దాదాపు రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్ళతో ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా అతిపెద్ద గ్రాస్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా హిందీలో కూడా మంచి వసూలు సాధించింది.
మొదటి రెండు వారాలలో బాలీవుడ్ లో దేవర అదరగొట్టేసింది. తర్వాత కొంచెం స్లో అయిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్. దాదాపు ముగించుకున్నట్టుగా తెలుస్తుంది. దేవర హిందీలో లైఫ్ టైం వసూళ్ళు రూ.80 కోట్ల నెట్‌వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అక్కడ మంచి లాభాలే అందించిందని చెప్పాలి. వాస్తంగా దేవర నార్త్ ఇండియా బిజినెస్ 15 కోట్లకి అమ్మారు. అక్కడ అలాంటిది ఏకంగా రూ.80 కోట్ల నెట్ వసూలు అంటే భారీ లాభాలు తెచ్చి పెట్టింది. సో దేవరతో హిందీలో ఎన్టీఆర్‌కు అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దేవర సాధించిన ఈ విజయం.. ఎన్టీఆర్ తర్వాత సినిమా వార్2కు మంచి బేస్మెంట్ గా నిలిచిందని చెప్పాలి.