మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది నటీనటులకు అండగా నిలిచారు. నాలుగు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా బోలా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


ఇదిలా ఉండగా.... చిరంజీవి డైరెక్టర్ హరీష్ శంకర్ తో తన తదుపరి సినిమా గురించి చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. అలానే మరో ఇద్దరు యువ దర్శకులతోనూ చిరంజీవి చేరువలో ఉంటున్నారట. ప్రస్తుతం వీరంతా స్క్రిప్ట్స్ మీద పనిచేస్తున్నారట. హరీష్ స్క్రిప్ట్ విన్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరో వైపు చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలైన అనంతరం తదుపరి సినిమా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి సినిమా కథలు విని ఓకే చెప్పి పక్కన పెడుతున్నారట. కానీ తదుపరి సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. బీవీఎస్ రవి - మోహన్ రాజా సినిమాని చిరంజీవి ముందుగా తెరమీదకి తీసుకువెళ్తారా, లేక స్క్రిప్ట్ నచ్చి హరీష్ శంకర్ సినిమాను ముందుకు తీసుకెళ్తారా అనేది చూడాలి.


సినిమా ఏదైనా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మెగా డాటర్ సుష్మిత కొణిదెల తన హోమ్ బ్యానర్ లో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారని సమాచారం అందుతోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి... తదుపరి సినిమాలపై మెగా ఫ్యాన్స్... ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. బోలా శంకర్, అలాగే ఆచార్య లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.... చిరంజీవికి బంపర్ హిట్ సినిమా రాలేదు. కాబట్టి ఆయన చేసే తదుపరి సినిమాలు కచ్చితంగా సక్సెస్ కావాలని మెగా ఫ్యాన్స్ కోరుకోవడం సాధారణం. ఆ దిశగానే మెగాస్టార్ చిరంజీవి అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: