ఒక్కొక్కరి.. జీవితంలో ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైంలో కెరీర్ తారాజువ్వ మాదిరిగా సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన తొక్కుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జోరుకు అస్సలు బ్రేకులు ఉండవు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు కూడా అలాంటి టైం వచ్చినట్టు కనిపిస్తోంది. బావ సీఎం, అల్లుడు మంత్రి. మరో అల్లుడు ఎంపీ. కూతుళ్లు ఇద్దరు ఎంట్ర‌ప్రెన్యూర్లు. ఇక తన సంగతి చెప్పక్కర్లేదు. హిందూపురంకు వరుసగా మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే. పేరున్న పెద్ద ఆసుపత్రికి చైర్మన్. రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే హీరో. పైగా కెరీర్లో ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు బాలయ్య ఖాతాలో ఉన్నాయి.


బాలకృష్ణ సినిమా కెరీర్ ఇప్పుడు పిక్స్‌లో ఉంది. వందకు పైగా సినిమాలు చేశారు. కానీ.. ఇప్పుడు రేంజ్ వేరు. నిజానికి 2010కి ముందు.. ఆ తర్వాత కూడా.. బాలయ్యకు అప్పుడో.. ఎప్పుడో.. హిట్ పడిందన్నట్టుగా ఉండేది. 2010 సింహ వచ్చిన తర్వాత.. 2014లో లెజెండ్ వచ్చేవరకు సరైన హిట్టు పడలేదు. మధ్యలో గౌతమిత్ర శాతకర్ణి హిట్ అయింది. ఆ తర్వాత 2021లో అఖండ వచ్చేవరకు అదే పరిస్థితి. హిట్ సంగతి పక్కన పెడితే.. బోయపాటి, క్రిష్, పూరీలతో వర్క్ చేస్తూనే కేఎస్‌. రవికుమార్ లాంటి సీనియర్లకు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చారు.


బాలయ్య. కేఎస్ రవికుమార్.. జై సింహా సినిమాతో పర్వాలేదనిపించారు. రూ.8 కోట్ల రేంజ్‌లో ఉండేది. అఖండ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఆలోచన మారిపోయింది. సరైన కథ, సరైన దర్శకుడు, నిర్మాత, వీటన్నింటికీ మించి సరైన గెటప్ ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్నారు బాలయ్య. రెండో కుమార్తె తేజస్విని పక్కనే ఉండి అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు బాలయ్య ఒక్కో సినిమాకు రూ.30 కోట్లు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు అనడం కంటే నిర్మాతలే ఇస్తున్నారు.


ఇవన్నీ ఇలా ఉంటే టాక్ షో అన్‌స్టాపబుల్‌ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. బాలయ్య బుల్లితెరపై కూడా తనను తన ప్రూవ్ చేసుకున్నారు. ఇక బాలయ్యకు పద్మ భూషణ్ ఇచ్చే ప్రతిపాదన రాష్ట్రం నుంచి వెళ్ళింది. బాలయ్యకు ఈ అవార్డు కూడా వస్తే అస్సలు తిరుగే ఉండదు. తెలంగాణలో స్టూడియో కూడా కట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూడియో నిర్మాణం కోసం ఆయన ఎప్పుడో దరఖాస్తు చేసుకునే ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బాలయ్యకు మహర్ద‌శ‌ పట్టింది. ఆయన జోరుకు బ్రేకులు పడే పరిస్థితిలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: