స్టార్ హీరోయిన్ నయనతార గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గత రెండు దశాబ్దాల నుంచి తన హవాను కొనసాగిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో నయనతారకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది.


ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అగ్ర హీరోల అందరి సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. సినిమాల పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.... నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు.



దానికి ఓ కారణం ఉందట. నయనతార, ప్రభాస్ కాంబినేషన్లో యోగి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ సినిమా సమయంలో నయనతార లైం***గిక వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఒక రాజకీయ నాయకుడు నయనతారను లైంగికంగా వేధించాడట.


ఆ సమయంలో నయనతార ఒంటరిగా ఉంటూ చాలా బాధపడ్డానని నయనతార చెప్పింది. ఆ సమయంలో నయనతార ఇకనుంచి ఎలాంటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కేవలం సినిమాలో నటించడం వరకు మాత్రమే చేస్తానని ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలకు రానని నయనతార దర్శక నిర్మాతలకు ముందుగానే చెబుతుందట. ఈ విషయాన్ని నయనతార ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: