నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబడుతున్నారు. అయితే ఈ భారాన్ని మొత్తం డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే తీసుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అలాగే నటీనటుల వ్యవహారాన్ని కూడా త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం తెలియజేయబోతోంది. మోక్షజ్ఞకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కుమార్తెను తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే ఈ చిత్రంలో మోక్షజ్ఞ కి విలన్ గా టాలీవుడ్ హీరో రానా అని ఎంచుకోబోతున్నట్లు ప్రశాంత్ వర్మ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అటు రానా కాని చిత్ర బృందం కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా పైన భారీ బజ్ ఏర్పడుతోంది. ఒకవేళ రానా నటించిన ఈ చిత్రంలో ఒకే చెప్పారంటే కచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ కి మరింత సహాయపడుతుందని బాలయ్య అభిమానులు తెలియజేస్తున్నారు.


గత కొంతకాలంగా రానా కూడా సరైన పాత్రలలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇతర హీరోలతో కూడా కలిసి స్క్రీన్ పంచుకోవడానికి కూడా మక్కువ చూపుతో ఉన్నారు. ఇటీవలే రజినీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రంలో కూడా నటించారు అలాగే హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు మోక్షజ్ఞ కోసం రానా విలన్ గా నటిస్తారా లేదా అనే విషయం తెలియాలి. నవంబర్ నెల చివరి నుంచి మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ జరగబోతోంది. డిసెంబర్ నెలలో రెగ్యులర్ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం.2026 మొదటిలోనే ఈ సినిమాని థియేటర్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: