ఇక నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024గాను టాలీవుడ్ నుంచి అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని కుటుంబం అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం రోజున హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కు ఎవరు ఊహించని విధంగా సినీ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.
అంతే కాకుండా అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత కూడా ఈవెంట్ లో పాల్గొంది. ఇక ఈవెంట్ లో నాగచైతన్య, శోభిత జంట చూడ చక్కగా కనిపించింది. శోభిత సింపుల్ అండ్ ట్రెడిషనల్ గా ముస్తాబయింది. గ్రీన్ కలర్ చీర కట్టుకొని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ చీరలో శోభిత లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈవెంట్ కు హీరోలు హీరోయిన్లు అందరూ తరలివచ్చారు. అయితే హీరోయిన్ సమంత మాత్రం ఫంక్షన్ కు హాజరు కాలేదు.
అయితే సమంతను పిలవాలని అక్కినేని కుటుంబం అనుకున్నప్పటికీ శోభిత దూళిపాళ్ల కారణంగా సమంతను ఇన్వైట్ చేయలేకపోయారని వార్తలు వస్తున్నాయి. సమంత ఈ ఫంక్షన్ కు వస్తే శోభిత కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుందని అక్కినేని కుటుంబం కూడా పిలవలేకపోయారట. సమంత మీద రివేంజ్ తోనే శోభిత ఇలా చేసిందని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది.