అంతేకాదు చిరంజీవితో కూడా కలిసి చిందులు వేసి ఓ రేంజ్ లో అలరించింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆమె టార్గెట్ నాగార్జున అని అంటూ తెలుస్తుంది . నాగార్జున తన కెరియర్ లో 100వ సినిమా కోసం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. కాగా నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని చూస్ చేసుకున్నారు అంటూ బాగా టాక్ వినిపించింది . అయితే ఈ సినిమాలో త్రిషని కాకుండా కాజల్ అగర్వాల్ ని ఫైనల్ గా చూస్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
దానికి కారణం డైరెక్టర్ . త్రిష ఓల్డ్ ఏజ్ హీరోయిన్ అయిపోయింది అని.. కాజల్ అగర్వాల్ నేటి జనరేషన్ ట్రెండీ సెకండ్ ఇన్నింగ్స్ హీరోయిన్ అని కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సీన్స్ నటించిన నాగార్జునని పెద్దగా తప్పు పట్టరు అని.. ఆ ఉద్దేశంతోనే డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి చిరంజీవి - బాలయ్యల తో నటించి తన కెరియర్ను ముందుకు తీసుకెళ్లిన కాజల్ ఇప్పుడు నాగార్జునతో కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ను ఓ రేంజ్ లో దున్నేయడాని ప్లాన్స్ వేస్తుంది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తే మాత్రం ఆమె తన పేరుకి మళ్ళీ పునర్ వైభవం అందుకున్నట్లే. అయితే కాజల్ గతంలో చాలా సార్లు ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది..!