టాలీవుడ్ కే గాడ్ ఫాదర్ గా నిలిచిన శివశంకర్ వరప్రసాద్ పేరు చిరంజీవిగా ఎలా మారింది ? అసలు ఈ పేరుని ఆయనకు ఎవరు మార్చారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఇక చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ పేరుని చిరంజీవి గా మార్చుకుని సినిమాల్లోకి వచ్చాడు . ఇక మెగాస్టార్ నటించిన మొదటి సినిమా పున్నదిరాళ్లు మూవీ చేస్తున్న సమయం లో స్క్రీన్ నేమ్ గా ఏం పేరు వెయ్యాలి అని ఆడిగినప్పుడు శివశంకర్ వరప్రసాద్ అని చిరు తన పేరును చెబితే ఆ పేరు స్క్రీన్ నేమ్ గా పనిచేయదని దర్శకుడు అప్పట్లో అన్నారు .. దాంతో శివశంకర్ వరప్రసాద్ పేరుని మార్చుకోవాలని అనుకున్నారు.


అలాంటి సమయంలో ఒక్కరోజు రాత్రి ఆయన పడుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో ఒక అతను కనిపించి శివశంకర్ వరప్రసాద్ ని చూస్తూ చిరంజీవి ఇలా రా అని పిలిచారట. అప్పుడు చిరంజీవి ఎవరిని పిలుస్తున్నారు అని అడిగితే నిన్నే అని ఇలా రా చిరంజీవి అని పిలిచారట . ఇక దాంతో తర్వాత రోజు చిరంజీవి వాళ్ళ అమ్మగారికి ఇది చెప్పారట. అప్పుడు వాళ్ళ అమ్మగారు చిరంజీవి అంటే ఆంజనేయ స్వామికి మరొక పేరు కాబట్టి ఈ పేరునే పెట్టుకోమని చెప్పడంతో చిరంజీవి పేరునే తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకోవడం ప్రారంభించాడు . ఆ తర్వాత మెగాస్టార్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమాను లను సొంతం చేసుకున్నాడు .. మెగా ఫ్యామిలీ అనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసి ఎందరో హీరోల ను టాలీవుడ్ కు అందించాడు . ఆరుపదులు వయసు దాటినా కూడా ఇప్పటికీ   ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ నేటి తరం హీరోల కు గట్టి పోటీ ఇస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: