టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 30 వ తేదీనే కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కొంత కాలం క్రితం తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హీరో అయినటువంటి కిరణ్మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేయనున్నాము. సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ తర్వాత వారం ఇతర భాషల్లో విడుదల చేస్తాం అని ప్రకటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 1.4 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లలో కలుపుకొని ఈ మూవీ కి 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగనుంది. మరి కిరణ్ అబ్బవరం సినిమాకు ఇది పెద్ద స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: