సాధారణంగా మన చిత్ర పరిశ్రమ లో ఉన్న చాలా మంది హీరోలు , నటులు వారీ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట కొద్ది రోజులు తడపడ్డారు .. ఆ తర్వాత నుంచి స్టార్ హీరో గా తనకంటూ ఓ స్టార్ డం ని తెచ్చుకున్నారు . అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో తమ్ముడు సినిమా కిక్ బాక్సింగ్ కి సంబంధించిన మూవీ  సంబంధించిన మూవీని చేశాడు .


తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించిన పవన్ కళ్యాణ్ కోసం తర్వాత చాలా మంది దర్శకులు అలాంటి సినిమాలే చేయడాని కి కథలు కూడా రెడీ చేశారు . కానీ ఆయన మాత్రం కొన్ని సినిమా లను మధ్య లోనే రిజెక్ట్ చేశాడు . అయితే శ్రీహరి హీరోగా ఎన్ . శంకర్ దర్శకత్వం లో వచ్చిన భద్రాచలం మూవీ కిక్ బాక్సింగ్ నేపథ్యం లో నడుస్తుంది . అయితే ఈ సినిమా ని పవన్ కళ్యాణ్ తో చేద్దామని ముందు గా అనుకున్నారట .. అయితే మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల పవన్ కళ్యాణ్సినిమా చేయ‌లేక‌పోయ్య‌డు . ఇక దాంతో దర్శకుడు ఎన్ . శంకర్ శ్రీహరి ని హీరో గా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు .


సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించిడం తో పాటు శ్రీహరి , దర్శకుడు ఎన్. శంకర్ కు మంచి పేరు తీసుకు వచ్చింది . అలాగే శ్రీహరి కి అయితే ఒక మంచి బూస్టప్ ఇచ్చిన సినిమా కూడా ఇదే అనే చెప్పాలి.  ఈ సినిమా తో ఆయన వరుసగా హీరోగా సినిమాలు చేస్తు వచ్చాడు. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో చాలా మంది హీరోలు మంచి స్టార్‌లు అవ‌ట‌మే కాకుండా వారి కెరీర్ లో కూడా హీరోలుగా సెటిల్ అయ్యారు .  ఇక భద్రాచలం సినిమాని పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హీట్ అయి ఉండేదని కూడా అప్పట్లో సిని ప్రముఖులు సైతం అన్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: