ఈ మధ్యకాలంలో కొంత మంది ఒక పెళ్లి చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి కాని వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా మగవాళ్లలో పెళ్లి కాని వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇలా ఒక పెళ్లి చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్న మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి మాత్రం ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని రాజుల బ్రతుకుతున్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు అని కూడా చెబుతున్నాడు. ఇక అలా నాలుగవ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్న అని చెబుతున్న వ్యక్తి ఓ నటుడు కావడంతో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆయన ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మలయాళ నటుడు బాల (బాల కుమార్). ఈయన కొంత కాలం క్రితమే తన చుట్టాలమ్మాయి అయినటువంటి కోకిల ను వివాహం చేసుకున్నాడు. ఇక ఈయన వయస్సు 42 సంవత్సరాలు కాగా ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి కోకిల వయస్సు కేవలం 24 సంవత్సరాలు. ఇకపోతే తాజాగా బాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తాడు. తాజా ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ ... నా వయసు 42 సంవత్సరాలు. నేను పెళ్లి చేసుకున్న కోకిల వయసు 28 సంవత్సరాలు. కానీ మా ఏజ్ గ్యాప్ మా బంధానికి ఏ మాత్రం అడ్డు కాలేదు. మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాము.

నేను రాజులా ఉంటే నా భార్యను నేను రాణిలా చూసుకుంటున్నాను అని చెప్పాడు. ఇక కోకిల మాట్లాడుతూ ... మామయ్య చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనది గొప్ప మనసు. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటాడు. ఆయన మనస్సు చూసి ప్రేమలో పడ్డాను. ఆయనను పెళ్లి చేసుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: