అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీసారూ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలవుతుందని అనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ పూర్తవకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ పాటలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.


ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అల్లు అర్జున్, మెగా కుటుంబాల మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు కొన్ని రోజుల కింద సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారాలు జరిగాయి.


మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరవుతాడా లేదా అనేది చూడాలి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చినట్లయితే వీరి కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టమవుతోంది. ఇక ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 సినిమా ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్... డిసెంబర్ ఒకటో తేదీన నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో... ఈ ఈవెంట్ నిర్వహిస్తారని చెబుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ వస్తారని  ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: