హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిస్. ఈ చిత్రాన్ని గీతా మోహన్ దాస్ తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేయాలనీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే ఫారెస్ట్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే చిత్ర బృందానికి ఫారెస్ట్ అధికారులు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి ఈశ్వర్ ఖండ్రే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రి స్వయంగానే ఫారెస్ట్ అధికారులను కూడా ఆదేశాలను జారీ చేస్తూ చిత్ర బృందం పైన కేసు నమోదు చేయాలని కూడా కోరారట.



హిందుస్థాన్ మెషిన్ టూల్స్, కెనరా బ్యాంకు విక్రయించినట్లుగా  ఆరోపణలు సైతం రావడం జరిగింది.అటవీ భూములలో యష్ చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ సెట్ వేయడానికి అనుమతి ఇచ్చారని అయితే ఈ అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికిందట. అందుకే పిన్యాలోని HMT ప్లాంటినేషన్లు రెండు రోజులపాటు సినిమా షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. నిబంధనలకు విరుద్ధంగా చేశారని  చిత్ర బృందాన్ని టార్గెట్ చేసినట్లుగా ఫారెస్ట్ ఆఫీసర్ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలుస్తోంది.అనుమతులు లేకుండా ఎవరైనా సరే అటవీ భూములలో చెట్లను నరకడం చాలా నేరమని.. టాక్సిస్ చిత్ర బృందం ఎన్ని చెట్లను నరికి వేశారు నిబంధన ప్రకారం అనుమతి ఉందా లేదా అనే విషయాలను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.



దీంతో అనంతరం అక్కడికి అధికారులు సినిమా షూటింగ్ సెట్ నీ సందర్శించి పరిశీలించినట్లు సమాచారం. ఎవరైనా సరే సెట్ నిర్మాణం కోసం చెట్లను నరికితే చిత్రం బృందం పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ మంత్రి ఈశ్వర తెలియజేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు మంత్రి ఈశ్వర ఖండ్రే. అయితే ఇందుకు సంబంధించి సాటిలైట్ ల ద్వారా ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: