‘పుష్ప 2’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ క్రియేట్ చేయబోతున్న రికార్డుల పై ఊహాగానాలు తారా స్థాయిలో కొనసాగుతున్నాయి. దీపావళి తరువాత ఈ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిపోతుంది. ఈ మూవీ విడుదల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక భారీ మూవీని చేస్తాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ మూవీ పై అధికారక ప్రకటన ఇంతవరకు రాలేదు.



ఈమధ్య నిర్మాత నాగవంశీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న భారీ మూవీ గురించి లీకులు ఇస్తున్నాడు కానీ ఆమూవీలో నటించే హీరో ఎవరు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వడంలేదు. అయితే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ మాత్రం పూర్తి అయిందని పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకోబోయే ఈ మూవీ రాజామౌళి సినిమాల రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెంచుతున్నాడు.



వాస్తవానికి ‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ సందీప్ వంగాతో కానీ లేదా నెల్సన్ తో కానీ ఒక భారీ ప్రాజెక్ట్ ను చేయాలని అనేకసార్లు చర్చలు కూడ జరిగినట్లు సమాచారం. అయితే ఆప్రాజెక్ట్ ల విషయం ఇంకా చర్చలు దశలోనే ఉండటంతో బన్నీకి త్రివిక్రమ్ తో మూవీ చేయడం మినహా మరొక మార్గం లేకుండా పోయింది అని అంటున్నారు. ఒక పురాణ కథ నేపధ్యంలో ఫ్యాంటసీ మూవీగా త్రివిక్రమ్ బన్నీల మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.



అయితే ఈ సినిమాను కనీసం 15 నెలలలో పూర్తిచేసే కమిట్మెంట్ పై అల్లు అర్జున్ త్రివిక్రమ్ కు తన డేట్స్ ఇవ్వాలనే బన్నీ ఆలోచన అని అంటున్నారు. సుకుమార్ రాజమౌళి లతో పోల్చుకుంటే త్రివిక్రమ్ చాల వేగంగా సినిమాలు చేస్తాడు అన్న పేరు ఉంది. పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ ఎంతవరకు వేగంగా సినిమా తీయగలడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..





మరింత సమాచారం తెలుసుకోండి: