ముఖ్యంగా సూర్య నటించిన కంగువా చిత్రానికి నిషాద్ ఎడిటర్ గా కూడా పనిచేశారట. ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు. అయితే ఇందులో కూడా యూసఫ్ సైతం పాల్గొన్నట్లు సమాచారం ఇటీవల ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా యూసఫ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. కానీ నిన్నటి రోజున ఉదయం తన సొంత ఇంటిలోనే ఇలా విగత జీవిగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు ఎడిటర్ నిషాద్ పనిచేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా తావినో థామస్ నటించిన తుళ్ళుమల్ల సినిమాకు కూడా ఎడిటర్ గా చేయడంతో ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా స్టార్ హీరోల చిత్రాలకు కూడా ఈయన ఎడిటర్ గా పని చేశారు. కానీ నిషాద్ ఇలా హఠాత్మరణంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురి చేసింది. మరి ఈ విషయం పైన అటు హీరో సూర్య కానీ పలువురు సెలబ్రిటీలు ఈ ఎడిటర్ కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తారేమో చూడాలి మరి.