* ధ్రువ సినిమాతో అరవింద స్వామి కి పెరిగిన డిమాండ్
* గతంలో హీరోగా రాణించిన అరవింద్ స్వామి
* రామ్ చరణ్ కు దీటైన విలన్ గా అరవింద్  కు పాపులారిటీ
* 2016లో ధృవ రిలీజ్


టాలీవుడ్ ఇండస్ట్రీలో... రకరకాల నటీనటులు వస్తున్నారు. కొంతమంది తక్కువ కాలంలో మెరుస్తుంటే... మరి కొంతమంది డిఫరెంట్ పాత్రలు చేసి సక్సెస్ అవుతున్నారు.  అయితే మన తెలుగు నటీనటులతో పాటు... పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నటీనటులకు తెలుగులో క్రేజ్ విపరీతంగానే ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు వారికే ఎక్కువగా ఛాన్సులు ఇస్తారు.

అచ్చం అలాగే... తెలుగులో ఒక్కసారిగా మెరిశాడు అరవిందస్వామి. గతంలో..  హీరోగా రాణించాడు అరవింద్ స్వామి. కానీ రామ్ చరణ్ హీరోగా చేసిన ధ్రువ సినిమాతో... తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో ఆయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను మించి పోయేలా... అసలు హీరో అరవింద్ స్వామి అన్నట్లుగానే ఆయన నటన ఉంది. విలన్ పాత్ర అయినా కూడా... ప్రేక్షకులను మొత్తం తన వైపు లాగేసుకున్నాడు అరవిందస్వామి.

 వాస్తవంగా 2016 డిసెంబర్ 9వ తేదీన ధ్రువ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేయగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.... అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఎన్ వి ప్రసాద్ కూడా నిర్మాతగా ఉన్నారు.  ఈ సినిమా స్టోరీ మొత్తం దొంగ పోలీస్.. అన్నట్లుగా సాగుతుంది.

 విలన్ గా..  నటించిన అరవింద్ స్వామి... భారీ స్కామ్ చేస్తే... పోలీస్ పాత్రలో నటించిన రామ్ చరణ్... ఆయనను కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు.కానీ హీరో రామ్ చరణ్ కు దొరకకుండా... అదిరిపోయే స్కెచ్ లతో అరవిందస్వామి మెరుస్తారు. దాంతో సినిమాలో అరవింద స్వామి పాత్ర చాలా కీలకంగా మారింది. హీరోను డామినేట్ చేసేలా... విలన్ పాత్ర బాగా పేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: