దర్శన్ కు కర్ణాటక హైకోర్టు సైతం మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈయన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరు వారాలపాటు మభ్యంతర బెయిల్ దర్శన్ కి జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగ్గట్టుగా షరతులను కూడా న్యాయస్థానం విధించినట్లుగా సమాచారం. గతంలో కూడా కింది కోర్టులో హీరో దర్శన్ బెయిల్ పైన దాఖలు చేసినప్పటికీ ఆ పిటీషన్ అన్ని తిరస్కరించారు. ఇప్పుడు న్యాయవాది సివి నగేష్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
దర్శన్ అనారోగ్య సమస్యల వల్ల బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును సైతం అభ్యర్థించడంతో పాటుగా దర్శనానికి ఉన్న అనారోగ్య సమస్యలను కూడా వివరించి తనకు పక్షవాతం వస్తుందేమోనని అనుమానంతోనే డాక్టర్లు ఇచ్చిన నివేదికను సైతం కోర్టు తీవ్రంగా పరిశీలించి ఆరువారాలపాటు మద్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా దర్శన్ కు చేయవలసిన సర్జరీలను వైద్యులు కూడా పరిశీలించి తెలియజేశారట అలాగే ఏ ఖైదీ కైనా సరే విచారణలో భాగంగా వైద్యం చేసుకుని సదుపాయం ప్రతి ఒక్కరికి ఉందనే విధంగా విషయాన్ని తెర మీదకి తీసుకురావడంతో ఈ విషయం పైన కోర్టు కూడా దర్శన్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ కేవలం ఆరువారాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఈ విషయంపైన అటు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.