ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ కూసింత  హై ఎనర్జీతో ముందుకు వెళ్ళిపోతున్నారు.  అది హద్దుల్లో ఉంటే ఎవరికి ప్రాబ్లం రాదు అని  హద్దులు మీరితేనే అసలు ప్రాబ్లం అంతా వస్తుంది అని చెప్పుకొస్తున్నారు జనాలు. కొంతమంది స్టార్స్ ఆ కారణంగానే ఎవరైనా అభిమానులు సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా పారిపోతున్నారు . మరి కొంతమంది తమ బాడీగార్డ్స్ తో నెట్టేస్తున్నారు . అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం అందుకు చాలా చాలా దూరంగా ఉంటుంది .


సాయి పల్లవిని ఎవరు సెల్ఫీ అడిగినా సరే చాలా ఓపికగా చాలా నెమ్మదిగా పిక్స్ ఇస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఆమె స్వయాన అక్కడ ఉన్న లేడీస్ ని పిలిచి స్వయంగా సెల్ఫీ ఫొటోస్ దిగి ఫ్యాన్స్ ని కుహి చేసింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సాయి పల్లవి హీరోయిన్గా శివ కార్తికేయ హీరోగా నటించిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .



అందులో భాగంగానే "అమరన్" ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు మేకర్స్.  ఇటీవల తెలుగులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.  రీసెంట్గా "అమరన్" యూనిట్ కేరళలో ప్రమోషన్స్ నిర్వహించారు . ఒక మాల్ లో ప్రెస్ మీట్ పెట్టారు . ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ సాయి పల్లవి అదే విధంగా శివ కార్తికేయన్  ఇద్దరు కూడా పాల్గొన్నారు . ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ అనంతరం సాయి పల్లవి స్టేజి దిగి వస్తూ ఉండగా ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని కోరగా ..ఆమె మెట్లు దిగుతూ ఉన్న మూమెంట్లో అత్యుత్సాహంతో సాయి పల్లవి పై ఫోన్  విసిరాడు ఓ అభిమాని . ఇది చాలా తప్పు పని. దీనితో సాయి పల్లవి చాలా ఓపికగా కోపం వచ్చిన కంట్రోల్ చేసుకొని తన కాళ్ల దగ్గర పడిన ఫోన్ ని చేతితో తీసుకొని మరి అభిమానికి సెల్ఫీ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయకు అంటూ కూసింత గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . సాయి పల్లవి ఏ విషయానైనా సరే చాలా కూల్ గా తీసుకుంటుంది అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఎగ్జాంపుల్..!



మరింత సమాచారం తెలుసుకోండి: