* స్క్రీన్‌పై అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మంటలు

* పుష్పగాడికే వణుకు పుట్టించిన భన్వర్ సింగ్ షెకావత్

* ఆ ఒక్కడితో సినిమా సూపర్ గా ఎలివేట్ అయింది  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఇరగదీశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఇందులో మెయిన్ విలన్  అయిన ఫహద్ ఫాసిల్ క్లైమాక్స్‌లో మెరిశారు. ఉన్నది కొంతసేపే ఆయన అతను అల్లు అర్జున్ యాక్టింగ్ లో బాగా డామినేట్ చేశారు. ఈ విలన్ చూపించిన నటన పట్ల బన్నీ తేలిపోయారు. స్క్రీన్ పై హీరో హీరోయిన్లు కనిపించిన అందరి కళ్ళు ఈ విలన్ పైనే పడ్డాయి అంతలా అతను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక ఇందులో అజయ్‌ఘోష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.

పుష్ప సినిమాలో ఫహద్ ఫాసిల్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆయన చేసిన విలన్ పాత్ర చాలా బాగుంది. ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్, పుష్ప సినిమా తన జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందో చెప్పారు. పుష్ప సినిమా తనను ఓ పాన్ ఇండియన్ స్టార్‌ని ఉందని అస్సలు అనుకోలేదట. మలయాళ సినిమాపైనే దృష్టి పెట్టాలని తెలుగు సినిమాల్లో నటించకూడదని అనుకున్నారు. కానీ సుకుమార్ అతని పాత్రను అద్భుతంగా డిజైన్ చేసి భారతదేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలుసు కదా? ఈ సినిమా పేరు పుష్ప 2: ది రూల్. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ మళ్ళీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర పేరు ఎస్.పి. భాన్వర్ సింగ్ షెకావత్. రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6, 2024న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపబోతుందని అంతా అనుకుంటున్నారు. అల్లు అర్జున్ (పుష్ప రాజ్), ఫహద్ ఫాసిల్ (ఎస్.పి. భన్వర్ సింగ్ షెకావత్) మధ్య జరిగే పోటీని చూడటానికి మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: