సినిమా వాళ్ళు అనగానే జనాలకి ఓ రకమైన ఉత్సుకత ఉంటుంది. నచ్చితే కొండెక్కించినట్టు మాట్లాడుతారు, లేదంటే అమాంతం కింద పడినట్టు మాట్లాడుతారు. ఎందుకంటే వారు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. అయితే ఒకప్పుడు ఎవరు ఎలా మాట్లాడుకున్నా, ఆ మాటలు నాలుగు గోడలు మధ్యనే ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలకు ఫ్రీడమ్ బాగా ఎక్కువైపోయిందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో నచ్చనివారిమీద చాలా ఈజీగా ట్రోల్స్ చేయడం పరిపాటి అయింది. నటుడు కిరణ్ అబ్బవరం మీద కూడా అలాగే ట్రోలింగ్ మొదలైంది.

గడిచిన నాలుగేళ్ల కాలంలో కిరణ్ ఏడాదికి రెండు సినిమాలు చొప్పున చేసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యాయి. వీటిని పట్టుకొని కిరణ్ పై ట్రోలింగ్ మొదలైందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తనపై వచ్చే ట్రోల్స్ పైన కిరణ్ అబ్బవరం ‘క’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది. అతను మాట్లాడుతూ... "ఏదైనా సాధించాలనే తపనతోనే ఇండస్ట్రీకి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. దేవుడి దయవలన పెద్ద బ్యానర్స్ లలో సినిమాలు చేసే అవకాశం చిక్కింది. అయితే కొందరు పనిగట్టుకొని ఏమీ తెలుసుకోకుండా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొందరు ఎంపీ కొడుకు అంటారు. మరికొందరు పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని చెబుతారు. నిజానికి నాకెలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఇప్పటికి ఊరికి వెళ్తే కూలి పని చేసుకునే లైఫ్ నాది. దయచేసి నన్ను వదిలేయండి! ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను." అంటూ వాపోయాడు.

అంటూ కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్ గా మాట్లాడగా... స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ పైన భారీస్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కిరణ్ కి చాలా మంది సపోర్ట్ గా పోస్టులు పెడుతుండడం విశేషం. అలాంటివి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పొతే ఎప్పటికైనా హైట్స్ చూస్తారని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది కుసంస్కారులు పనిగట్టుకొని చేసిన కామెంట్స్ కి మీరు బాధపడొద్దని కిరణ్ ని ఓదారుస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: