ఇక తమిళనాడులోని పన్రూతికి చెందిన దీపికా రంగరాజు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆమె పలు కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ, కళలపై తన మక్కువని చాటుకొన్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ఆరంభించిన దీపిక "చిత్రిరమ్ పెసుతాడి" అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు. కాగా ఆ సీరియల్‌కు తమిళ బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ మా నిర్మించిన బ్రహ్మముడి సీరియల్‌లో ఆమెకి అవకాశం దక్కింది. అలా చేసిన కావ్య పాత్ర ఆమెకి ఇక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఆ రోల్ తెలుగు ఆడపడుచులకు బాగా చేరువ అయ్యింది. బ్రహ్మముడికి టాప్ రేటింగ్ దక్కడానికి దీపిక కారణమని బుల్లితెర ప్రేక్షకులు అంటుంటారు. కాగా ఈ సీరియల్‌లో నటించినందుకు గాను ఆమెకు పెద్ద మొత్తంలో తీసుకుంటోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క రోజుకి ఆమె నటించినందుకు గాను, 35 వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇలా దాదాపు 25 రోజులపాటు షూటింగ్‌లో ఆమె పాల్గొంటారు. దాంతో దీపిక రంగరాజు ఓ నెలకు సుమారుగా రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తారని టాక్. ఇదిలా ఉండగా.. తమిళ, తెలుగు టీవీ రంగంలో రాణిస్తున్న దీపిక రంగరాజు.. తమిళంలో "ఆరాడీ" అనే సినిమాలో కూడా నటించిందనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.